Team India's victory..Clean sweep of the series
mictv telugu

టీమిండియాదే విజయం..సిరీస్ క్లీన్ స్వీప్

July 28, 2022

వెస్టిండీస్‌ జట్టు మధ్య టీమిండియా జట్టు మధ్య గతరాత్రి జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి, సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా రెండు గంటలపాటు నిలిచిపోయిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 36 ఓవర్లలో 225 పరుగులు చేయగా, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్ధారించారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 119 పరుగుల తేడాతో ధావన్ సేన ఘన విజయం సాధించింది. అంతేకాదు, విండీస్ గడ్డపై మూడు, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ తొలిసారి క్లీన్‌స్వీప్ చేసింది.

భారత జట్టు.. ఓపెనర్లు శిఖర్ ధావన్ 74 బంతుల్లో 7 ఫోర్లతో 58 పరుగులు, శుభమన్ గిల్ 98 పరుగులతో, తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించారు.ఆ తర్వాత శిఖర్ ధావన్ ఓట్ అవ్వగా, గిల్‌తో కలిసి చక్కని సమన్వయంతో ఆడాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్.. 34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేసి అకీల్ హొసీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8) కూడా పెవిలియన్ చేరాడు. మరోవైపు, గిల్ 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. విండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్‌ రెండు వికెట్లు తీసుకోగా, అకీల్‌కు ఒక వికెట్ దక్కింది. త్రుటిలో శతకం కోల్పోయిన గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్-విండీస్ మధ్య రేపటి నుంచి 5 వన్డేల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.