ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. పలు సర్జరీల తర్వా మెడిసిన్స్ వాడుతూ కాలక్షపం చేస్తున్నాడు. పూర్తిగా కోలుకుని, మళ్లీ ఫీల్డ్‌లో దిగడానికి ఏడాదికిపైగా పట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం సరదా పోస్టులతో సందడి చేస్తే రిషబ్ పంత్ ప్రమాదం తర్వాత అటువైపు వెళ్లలేదు. సర్జరీల ఫలితంగ కొంచెం లేవడానికి వీలు కలగడంతో మళ్లీ వచ్చేశాడు.
వాకింగ్ స్టిక్ పట్టుకుని ఒక్కో అడుగు వేస్తున్న తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి One step forward One step stronger One step better అని క్యాప్షన్ పెట్టాడు. పంత్ అభిమానులు, క్రికెట్ ప్రియులు లక్షల్లో లైక్ చేస్తూ వేలల్లో కామెంట్లు పెడుతున్నారు. హ్యాట్సాఫ్ అని, నువ్వు హీరోవు అని, మెల్లగా అలాగే ఫీల్డ్ లోకి వచ్చేసెయ్ అని అంటున్నారు. పంత్ గత ఏడాది డిసెంబర్‌లో ప్రమాదానికి గురయ్యాడు. బెంజ్‌కారులో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతని కారు డివైడర్‌ను ఢీకొని మంటల్లో కాలిపోయింది. అతని వెన్నెముక, నుదురు, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. 9 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.