కంటతడి పెట్టిస్తున్న వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కంటతడి పెట్టిస్తున్న వీడియో

February 25, 2022

ఉక్రెయిన్ దేశంపై గురువారం నుంచి రష్యా బలగాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు ఆక్రమించాయి. దీంతో ఉక్రెయిన్ దేశ ప్రజలు భయంతో వణుకుతూ, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఆ దృశాలను సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న యావత్ ప్రపంచ దేశ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఓ తండ్రి తన కూతురిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, కన్నీరుమున్నీరు అయిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

VIDEO

 

తండ్రి తన కూతురు, భార్యను సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ భావోద్వేగానికి లోనైయ్యాడు. కూతురిని గుండెకు హత్తుకొని కన్నుల నిండా బాధ, ప్రేమతో ఎంతో ఉద్వేగానికి లోనవుతూ కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాకుండా కూతురు బస్సు ఎక్కి వెళ్లిపోతుంటే కూడా తన చేతులను బస్సు అద్దంపై పెట్టి తండ్రి కంటతడి పెట్టుకున్నాడు. తండ్రి కంటతడి పెట్టడం చూసిన కూతురు, పక్కనే ఉన్న మహిళ కూడా వెంటనే ఏడవటం ప్రారంభించారు. అయితే, ఈ దృశ్యాలు ఎక్కడ జరిగాయనే విషయంపై క్లారిటీ లేదు. దీనిని చూసిన నెటిజన్లు మాత్రం వీడియో గుండెలు పిండేసేలా ఉందంటూ, యుద్ధ తీవ్రతకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయంటూ కామెంట్‌ చేస్తున్నారు.