కన్నీటి సంద్రం ఇండోనేషియా… ఆహారం, మంచినీళ్ళ కోసం జనాలు లూటీలు - MicTv.in - Telugu News
mictv telugu

కన్నీటి సంద్రం ఇండోనేషియా… ఆహారం, మంచినీళ్ళ కోసం జనాలు లూటీలు

October 1, 2018

ఇండోనేషియా కన్నీటి సంద్రం అయింది. ఎటు చూసినా మృతదేహాలే.. ఆకలి కేకలు… ఆర్తనాదాలు.. భీతావహ దృశ్యాలు. భూకంపం తర్వాత వెంటనే సునామీ ఉత్పాతాలు ఒకదాని తర్వాత ఒకటి కూడబలుక్కున్నట్టు ఇండోనేషియా జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. శిథిలాల కింద చిక్కుకుని ఆపన్నహస్తం కోసం వేలాది మంది గిలగిలా కొట్టుకుంటున్నారు. దాదాపు 6 మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగిసి పడగా, తొలిరోజున 400 మంది వరకూ మరణించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. 24 గంటలు గడిచేసరికి మృతుల సంఖ్య 832కు చేరింది.Tears of indonesia.. Stealing people for food and drinking waterమృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అంటున్నారు. పలూ నగరంలో పరిస్థితులు చాలా దారుణంగా వున్నాయి. పేరుకుంటున్న మృతదేహాలతో అంటువ్యాధులు ప్రబలుతాయని సామూహిక ఖననాలు చేస్తున్నారు. ఆకలి, మంచినీళ్ళ కోసం జనాలు తల్లడిల్లిపోతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి షాపుల మీద పడుతున్నారు. మంచినీళ్ళ ట్యాంకర్లను లూటీ చేస్తున్నారు.

ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని, సునామీ ప్రభావం చూపిన ప్రాంతాలకు ఇంకా సహాయక బృందాలు చేరుకోలేదని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్‌ కల్లా ప్రకటించారు.