బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్ ది ఇయర్..సత్య నాదెళ్ల - MicTv.in - Telugu News
mictv telugu

బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్ ది ఇయర్..సత్య నాదెళ్ల

November 21, 2019

CEO Satya Nadella..

తెలుగువాడైన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఫార్చూన్‌ మ్యాగజైన్‌ రూపొందించిన ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2019’ జాబితాలో సత్య నాదెళ్ల ఈ ఏడాదికి గాను మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 

సాహసోపేత లక్ష్యాలు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సామర్థ్యం, సులువైన పరిష్కార మార్గాలను కనిపెట్టగల నేర్పరితనం ఉన్న సారథులను ప్రపంచవ్యాప్తంగా అన్వేషించి ఈ జాబితాను ఫార్చూన్ తయారు చేసింది. ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. సత్య నాదెళ్లతోపాటు మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, అరిస్టా అధిపతి జయశ్రీ ఉల్లాల్‌కు ఈ గౌరవం దక్కింది. బంగా 8వ స్థానంలో ఉండగా, ఉల్లాల్ 18వ స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా 2014 నుంచి సత్య నాదెళ్ల ఉండగా, ఆయన పనితీరును ఈ సందర్భంగా ఫార్చూన్ కొనియాడింది.