ఆయన జీతం రూ.150 కోట్లు..! ఎవరాయనంటే..? - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన జీతం రూ.150 కోట్లు..! ఎవరాయనంటే..?

July 7, 2017

ఏడాదికి కోటి…రెండు కోట్లు…మహా అంటే పదికోట్లు..కానీ ఈయన వేతనం ఏటా రూ.150 కోట్లు..ఇంతకీ ఈయన ఎవరో తెలుసా… టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ. దిగ్గజ కంపెనీల సీఈఓ లతో పోలిస్తే ఈయన జీతమే ఎక్కువ. తీసుకుంటే తీసుకున్నాడు…కానీ కిందిస్థాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిపి వేసి తీసుకోవడం అన్యాయం.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు బ్యాడ్ టైమ్ నడుస్తుంటే సీఈఓలకు మాత్రం బూస్టింగ్ టైమ్ నడుస్తోంది. ఎవరికి జీతాలు పెరిగినా..పెరుగకపోయినా ఈ ఏడాది సీఈవోలకు టుమాచ్ ఇంక్రీమెంట్ పడింది. కొంత కాలంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న టెక్‌ మహీంద్ర ఈమధ్య ఆరేళ్ల సర్వీస్‌ దాటిన ఉద్యోగులకు అప్రైజల్స్‌ ఇవ్వడాన్నిఆపేసింది. సంస్థలోని టీం లీడర్స్‌ అంతకంటే పైస్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపింది. వారు తమ వేతన పెంపు కోసం మరో ఆర్నెల్లు వేచి చూడాల్సిన పరిస్థితి. అదే తమ ఎగ్జిక్యూటివ్‌ల విషయంలో మూడేళ్లుగా వారికి అత్యధిక వేతనాలు చెల్లిస్తోంది. ఈ సంస్థ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీకి వేతనంగా ఏటా రూ.150.7 కోట్లు ఇస్తోంది.

మార్చి 31, 2017 ముగిసే నాటికి గుర్నారీ అందుకున్న జీతం దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో మొత్తం బోర్డు అందుకుంటున్న దానితో సమానమని ఇటీవల ఓ నివేదిక తెలిపింది. ఇక 2015-16 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ మాజీ సీఈవో, ప్రస్తుత టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వేతనం రూ.30.15కోట్లకు పెరగగా, ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కాల్‌ జీతం రూ.45.11 కోట్లుకు చేరింది. వీళ్లకు ఇస్తే ఇచ్చుకోనీ కానీ మూమూలు ఉద్యోగులకు కోతలు పెట్టి ఇలా పెంచుకోవడం ఏంటో…