సక్కగ సద్వుకోక..ఇవ్వేం పన్లురా బై - MicTv.in - Telugu News
mictv telugu

సక్కగ సద్వుకోక..ఇవ్వేం పన్లురా బై

November 22, 2017

సదువుకోక ముందు కాకరకాయ, సదివినంక కీకరకాయ అన్నట్టే ఉంది కొందరు విద్యార్థుల వంకర బుద్ధి చూస్తుంటే. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ హాస్టల్ ఉంటూ బీటెక్ చదువుతున్నాడు రాహుల్ అనే కుర్రాడు.

అయితే  దమాక్ల ఏం పురుగు మెసిలిందో ఏమో, అడ్డదారిల డబ్బు సంపాదించాలనే ఆశతోని, హీరోయిన్ల ఫోటోలను  మార్ఫింగ్ జేసివెబ్‌సైట్ల పెట్టుడు మొదలు పెట్టిండు. ఇలా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ జేశెటోళ్ల  మీద నిఘా పెట్టమని ఇదివరకే ‘మా’ అసోసియేషన్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇగ పోలీసులు నిఘా పెడితే, వలలో పడ్డ శాపలెక్క ఈ రాహుల్ దొర్కిండు.

ఇగేముంది బీటెక్ జేశి మంచి కొల్వుజేస్తడనుకుంటే.. ఇట్ల ఇజ్జత్ తీస్కొని కటకటాల పాలైండు. హైదరాబాద్ లోనే కాదు దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలా మార్ఫింగ్ గాళ్లు మోపైనరని పోలీసులు చెబుతున్నారు. తొందరలోనే అందరిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.