ప్రాణం తీసిన ఎఫ్బీ స్నేహం.. బెంగాల్ నుంచి వచ్చి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణం తీసిన ఎఫ్బీ స్నేహం.. బెంగాల్ నుంచి వచ్చి..

May 8, 2019

ఫేస్‌బుక్ స్నేహం మరో మహిళను బలితీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో వుండే మహిళకు, హైదరాబాద్‌లో వుండే పురుషుడికి ఎఫ్బీ ద్వారా పరిచయం ఏర్పడింది. అతను ఆమెను కలవడానికి హైదరాబాదు రమ్మనగా ఆమె వచ్చింది. ఇద్దరూ కలిసి ఓ లాడ్జిలో దిగారు. గదిలో ఇద్దరిమధ్య ఏం జరిగిందో తెలియదు మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన వనస్థలిపురంలోని ఒయో లాడ్జిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యను తొలిత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడిని పట్టుకున్నారు.

Techie found dead in Hyderabad lodge


ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ పేరు సంగీత(48). బెంగాల్‌లో ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన లోకేష్(28) ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరిమధ్య నిత్యం చాటింగ్ జరుగుతుండేది. ఈ క్రమంలో అతను ఆమెను హైదరాబాద్ రమ్మన్నాడు. గత మూడు రోజులుగా వీళ్లిద్దరూ కలిసి అభ్యుదయ నగర్‌లోని ఒయో లాడ్జిలో ఉన్నారు. నిన్న రాత్రి వారి మధ్య గొడవ జరిగినట్లు లాడ్జి సిబ్బంది ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె హత్యకు గురైంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు ఆమెను హత్య చేశాడనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.