కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెళ్లాల్సిన ప్రత్యేక విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. షెడ్యూల్ ప్రకారం కొచ్చి వెళ్లాల్సిన అమిత్ షా.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తటంతో.. హైదరాబాద్‌లోని ఎన్ఐఎస్‌లో ఉన్నారు. మరో విమానం వచ్చాక.. కొచ్చికి వెళ్లనున్నారు అమిత్ షా. మరోవైపు విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో సీఐఎస్‌ఎఫ్ (CISF) 54వ వ్యవస్థాపక దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం అమిత్ షా నిన్న రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా.. ఈ కార్యక్రమం అనంతరం హకీంపేట నుంచి నేరుగా కొచ్చి వెళ్లాల్సి ఉండగా.. అనుకోకుండా విమానంతో తలెత్తిన సాంకేతిక సమస్యతో.. కొంత ఆలస్యం అయ్యింది. మరో విమానం వచ్చాక అమిత్ షా కొచ్చికి వెళ్లనున్నారు. విమాన మరమ్మతులకు సమయం పట్టడంతో అమిత్ షా… విమానాశ్రయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లతో సమావేశమయ్యారు.