ట్రూకాలర్ యాప్‌తో జాగ్రత్త అంటున్న నిపుణులు - MicTv.in - Telugu News
mictv telugu

ట్రూకాలర్ యాప్‌తో జాగ్రత్త అంటున్న నిపుణులు

August 23, 2019

truecaller.

స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ట్రూకాలర్‌ యాప్‌ సుపరిచితమే. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని కాల్స్ నెంబర్ల వివరాలను ఈ యాప్‌ తెలుపుతుంది. కానీ, ట్రూకాలర్‌ యాప్‌ యూజర్లు ఈ యాప్ పట్ల జాగ్త్రతగా వహించాలని పలువురు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. 

ట్రూకాలర్ యూజర్ అకౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఈ యాప్‌లోని ప్రధాన సాంకేతిక లోపాన్ని ఎహరాజ్‌ అహ్మద్‌ అనే సాంకేతిక నిపుణుడు కనుగొన్నారు. పనిచేయని ఫోన్‌ నెంబర్ల ఆధారంగా కూడా ట్రూకాలర్‌ యూజర్ల వివరాలు తెలుసుకోవచ్చని ఆయన గుర్తించారు. అయితే, ట్రూకాలర్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌లోకి సైబర్‌ అటాకర్లు లాగిన్‌ కావడానికి ఈ లోపం ఉపయోగపడుతుందని, ఒకసారి ఎవరైనా అటాకర్‌ నెంబర్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌ ద్వారా ట్రూకాలర్‌ యూజర్ అకౌంట్‌లోకి లాగిన్‌ అయితే.. అతని వివరాలు, డాటా అటాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని అహ్మద్‌ తెలిపారు. అలాగే ట్రూకాలర్ యూపీఐ పేమెంట్స్ పట్ల కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.