భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త మొబైల్ గురువారం విడుదలయింది. మధ్యతరగతి వారిని ఆకట్టుకునేలా పదివేల లోపు ధరతో టెక్నోస్పార్క్ 9 సిరీస్‌లో మరో మొబైల్ చేరింది. 50 మెగా పిక్సెల్ కెమెరా, 5000 mah బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాలు ఈ ఫోన్ ప్రత్యేకతలు. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై రన్ అయ్యే ఈ ఫోనులో ర్యామ్‌ను వర్చువల్‌గా పొడిగించుకునే అవకాశం ఉంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ మొమోరీ ఉండే ఈ ఫోన్ ధర రూ. 9299గా కంపెనీ నిర్ణయించింది. ఈ కామర్స్ సైట్లయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఆగస్టు 5 నుంచి అందుబాటులోకి వస్తుంది. వెనుకు 50 ఎంపీ కెపాసిటీతో మూడు కెమెరాలు, ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను పొందుపరిచింది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ Hios7.6 ఓఎస్‌తో పనిచేస్తోంది. ఫుల్ హెచ్డీ, రెజల్యూషన్ ఉన్న ఈ ఫోను 6.6 ఇంచుల డిస్ప్లే కలిగి ఉంది.