రూ.6299కే స్మార్ట్‌ఫోన్..బ్లూటూత్ ఇయర్ పీస్ ఉచితం - MicTv.in - Telugu News
mictv telugu

రూ.6299కే స్మార్ట్‌ఫోన్..బ్లూటూత్ ఇయర్ పీస్ ఉచితం

January 11, 2020

jjhgbv

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మరో ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. టెక్నో స్పార్క్ గో ప్లస్ పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చడం విశేషం. దీని ధరను రూ.6,299గా నిర్ణయించారు. హిల్లర్ పర్పుల్, వెకేషన్ బ్లూ రంగుల్లో ఇది లభించనుంది. దేశవ్యాప్తంగా 35 వేల రిటైల్ టచ్ పాయింట్లలో దీన్ని అమ్మకానికి ఉంచనున్నారు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.799 విలువైన బ్లూటూత్ ఇయర్ పీస్ ఉచితంగా అందించనున్నారు. వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్, ఒక నెలపాటు అదనపు వ్యారెంటీ, రూ.297 విలువైన గానా ప్లస్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందించనున్నారు.

 

టెక్నో స్పార్క్ గో ప్లస్ ఫీచర్లు

 

* 6.52 అంగుళాల హెచ్ డీ+ నాచ్ డిస్ ప్లే,

* మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 

* 8 మెగా పిక్సెల్ రేర్ కెమెరా,

* 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 

* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* డ్యూయల్ సిమ్ ఫీచర్,

* ఫింగర్ ప్రింట్ సెన్సార్.