బాలుడి కోరిక.. తరలొచ్చిన 2100 స్పోర్ట్స్ కార్లు..  - MicTv.in - Telugu News
mictv telugu

బాలుడి కోరిక.. తరలొచ్చిన 2100 స్పోర్ట్స్ కార్లు.. 

November 24, 2019

Teen boy dying of cancer wanted a sports car funeral procession 

పిల్లలకు బొమ్మలంటే ఇష్టం. అందులోనూ కారు, బస్సు, రైలు బొమ్మలు మరింత ఇష్టం. అమెరికాలోని మిస్సౌరీకి చెందిన 14 ఏళ్ల అలెక్ ఇన్’గ్రామ్ కూడా కార్లంటే ఇష్టం. స్పోర్ట్స్ కార్లంటే మరీ ఇష్టం. ఆడుతూ పాడుతూ పెరుగుతున్న ఆ చిన్నారిని చూసి విధికి కన్నుకుట్టింది. ఆస్టియోసర్కోమా అనే ఎముక కేన్సర్ సోకింది. కానీ కార్లపై అతనికి మరింత ప్రేమ పెరిగింది. వ్యాధి నయంకాదని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీటి మధ్య అతని చివరి కోరిక ఏంటని అడిగారు. 

‘నా అంతిమ యాత్రకు దండిగా స్పోర్ట్స్ కార్లు రావాలి.. ’ అని కోరాడు ఆ బాలుడు. అలెక్ ఈ నెల 7న కన్నుమూశాడు. అతని చివరి కోరిక తీర్చడానికి చాలా మంది ముందుకొచ్చారు. సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ సంస్థ అయితే స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అంటూ ప్రచారం నిర్వహించింది. అలెక్ కోరిక తీర్చడానికి అమెరికా నలుమూలల నుంచి 2100 స్పోర్ట్స్ కార్లతోపాటు 70 స్పోర్ట్స్ బైకులు తరలి వచ్చాయి. ఇమ్మానుయేల్ లూథరన్ చర్చ్ దాకా సాగిన అంతిమయాత్రలో అవన్నీ నెమ్మదిగా సాగాయి. సిడ్నీస్ సోల్జర్ సంస్థను నిర్వహిస్తున్న డానా క్రిష్టియన్ కూడా బిడ్డను 8 ఏళ్ల వయసులోనే పోగొట్టుకున్నవారే కావడంతో ఈ ప్రచారంలో పాల్గొన్నారు.