అమెరికాలో ఆడ గజిని.. 2 గంటలకు ఒకసారి అలారం.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో ఆడ గజిని.. 2 గంటలకు ఒకసారి అలారం..

September 12, 2019

సూర్య, అసిన్ జంటగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గజనీ’ సినిమా మీరు చూసే ఉంటారు? అందులో హీరో సూర్య తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రతి పావుగంటకు ఒక్కసారి అప్పటివరకు జరిగిందంతా మర్చిపోతూ ఉంటాడు. ఈ సమస్య పరిష్కారం కోసం టైమర్ ఉన్న కెమెరాను వెంట పెట్టుకుంటాడు. 

అయితే అలాంటి వ్యక్తి ఒకరు నిజజీవితంలో ఉండడం విశేషం. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రానికి చెందిన రైలీ హార్నర్(16) ఈ సంవత్సరం జూన్ 11న డ్యాన్స్ చేస్తుండగా, తలపై బలమైన దెబ్బ తగిలింది. దీంతో ప్రతి 2 గంటలకు ఒక్కసారి అంతకు ముందు ఏం జరిగిందో మర్చిపోతుంది. ఆమె ప్రతిరోజును జూన్ 11గానే గుర్తు చేసుకుంటోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా మెదడు సి.టి, ఎంఆర్ఐ స్కాన్లు తీసి ఎలాంటి సమస్య లేదని తేల్చిచెప్పారు. రైలీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఆమె తన ఫోన్‌లో ప్రతీ రెండు గంటలకు ఓసారి అలారమ్‌ను సెట్ చేసుకుంటుంది. ఓసారి అలారమ్ మోగగానే తాను రాసుకున్న నోట్స్‌లో తన పేరు, చిరునామా, తన లాకర్ రూమ్ నంబర్, పాస్ వర్డ్ వంటి వాటిని గుర్తు చేసుకుంటుంది.