వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి విషయం వచ్చేసరికి ఆ యువతి.. తన ప్రియుడికి ‘నో, చెప్పింది. దీంతో ఆ యువకుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వివరాలిలా.. రష్యాకు చెందిన బేలా రావోయన్(18), అమిక్ షామోయన్(20) ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే బేలా.. తాను ప్రేమించిన అమిక్ తో పెళ్లికి నిరాకరించింది. అయితే బేలా 18వ పుట్టినరోజు తర్వాత కిడ్నాప్ చేయడానికి అమిక్ ప్లాన్ చేశాడు.
వీడియోలో.. బేలా కుటుంబం నడుపుతున్న కేఫ్‌లో నిందితుడు తుపాకీని ఊపుతూ కనిపించాడు. తన తండ్రి, సోదరుడితో కలసి అమిక్ ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇక.. కూతురు కిడ్నాప్ అయినట్లు బేలా తండ్రి పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడంతో రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ రంగంలోకి దిగింది. అమిక్ షామోయన్ను సీసీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేసింది. అమిక్ తండ్రి, సోదరుడు ఏజెన్సీ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. నిందితుడిని రిమాండ్‌కి తీసుకుని విచారిస్తున్నారు.
#Russia: Woman in #Tombov kidnapped because she refused to marry the guy. "Russian World" pic.twitter.com/zxdXfin9Dc
— Igor Sushko (@igorsushko) November 29, 2022
కొద్దిరోజుల తర్వాత కిడ్నాపర్ల నుంచి విముక్తి పొందిన బేలా పోలీసులకు సమాచారం అందించింది. తనను కిడ్నాప్ చేసి నిజ్నీ నొవ్గోరోడ్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు చెప్పింది. తన తండ్రి మరొక సంపన్న కుటుంబంలోని యువకుడితో వివాహం చేయాలనుకున్నాడని.. అందుకనే ప్రియుడు కిడ్నాప్ చేసినట్లు ఆమె చెప్పినట్లు సమాచారం. బాలిక కిడ్నాప్‌ను ‘వధువు దొంగతనం(medieval custom)’ అని రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలా నచ్చిన అమ్మాయిని తీసుకుని పోవడం అనేది పురాతన సంప్రదాయం. రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ ప్రబలంగా ఉంది.