బెడిసి కొట్టిన బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఆపరేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

బెడిసి కొట్టిన బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఆపరేషన్

October 26, 2022

దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లు కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్ లో చేరడంతో బీజేపీ పార్టీ నాయకత్వం షాక్ అయింది. మునుగోడు ఉప ఎన్నికల టైంలో కీలకమైన బీసీ నేతలు ఇద్దరు టీఆర్ఎస్ లో చేరడంతో బీజేపీ డిఫెన్స్ లో పడింది. బీసీ ఓట్లు గణనీయంగా ఉన్న మునుగోడుపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించింది. దెబ్బకు దెబ్బ తీసి టీఆర్ఎస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని బీజేపీ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు.

ఇందులో భాగంగానే ఢిల్లీ స్థాయిలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ పార్టీ ప్లాన్ చేసింది. ఢిల్లీలోని ఒక పీఠాధిపతితో పాటు తిరుపతి కి చెందిన మరో వ్యక్తి, హైదరాబాద్ కు చెంది బిజినెస్ మేన్ లతో బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ బృందం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు ఆశ జూపి బీజేపీ లోకి ఆహ్వానించారన్న చర్చ నడుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలతో పాటు సెంట్రల్ లెవల్ లో కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ఆశ చూపినట్టు తెలుస్తోంది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇవ్వడం, ఆయన డైరెక్షన్ లోనే మొత్తం ఆపరేషన్ ప్లాన్ అయినట్టు సమాచారం. ఇందులో భాగంగానే తమను సంప్రదించిన బీజేపీ నేతలను నమ్మించి, మొయినాబాద్ లోని ఫాంహౌజ్ కు రప్పించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. దీంతో బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఆపరేషన్ బెడిసికొట్టినట్టైంది.