telanagana government holidays list
mictv telugu

2023లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల జాబితా ఇదే

November 17, 2022

వచ్చే ఏడాది(2023)కి సంబంధించిన ప్రభుత్వ సెలవులను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. మొత్తం 2023లో 28 జనరల్ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులున్న జాబితాను సీఎస్ సోమేష్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇవన్నీ కూడా వేతనంతో కూడిన సెలవులుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. న్యూఇయర్ ఆదివారం రోజు రాగా.. భోగి పండుగా రెండో శనివారం రోజు వచ్చింది. సంక్రాంతి పండుగ కూడా ఆదివారం రోజే వచ్చింది. దీపావళి పర్వదినం సైతం ఆదివారం రోజే వచ్చింది. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగా అక్టోబర్ 10న వచ్చింది. ఆ రోజు సెలవు ఉంటుంది. ఇంకా విజయవదశమి సందర్భంగా అదే నెల 24న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీపావళి సెలవును నవంబర్ 12న ప్రకటించింది.

జనరల్ సెలవులు..

జనవరి 1 – నూతన సంవత్సరం
జనవరి 14 – భోగి
జనవరి 15 – సంక్రాంతి
జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 7 – హోళీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి
ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్ 22 – రంజాన్‌
ఏప్రిల్ 23 – రంజాన్ తదుపరి రోజు
జూన్ 29 – బక్రీద్
జులై 17 – బోనాలు
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబరు 7 – కృష్ణాస్టమి
సెప్టెంబరు 18 – వినాయక చవితి
సెప్టెంబరు 28 మిలాద్‌-ఉన్‌-నబి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 14 – బతుకమ్మ ప్రారంభం
అక్టోబరు 24 – విజయదశమి
అక్టోబరు 25 – విజయదశమి తర్వాతి రోజు
నవంబర్ 12- దీపావళి
నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
డిసెంబరు 25 – క్రిస్మస్
డిసెంబర్ 26 – బాక్సింగ్ డే

* ఆప్షనల్ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.