కేటీఆర్‌తో ఆదిత్య ఠాక్రే ముచ్చట.. తెలంగాణ పెవిలియన్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌తో ఆదిత్య ఠాక్రే ముచ్చట.. తెలంగాణ పెవిలియన్‌లో

May 24, 2022

స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలుగు రాజకీయ నేతలు సందడి చేస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలుసుకుని ముచ్చట్లు పెట్టుకున్నారు.

 

దావోస్ వేదికగా ఇలాంటి సైడ్ లైట్స్ అనేకం చోటు చేసుకుంటున్నారు. మాహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కేటీఆర్‌ తెలంగాణ పెవిలియన్‌లో కలుసుకున్నారు.

 

పలు అంశాల్లో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఇరువురు నిర్ణయించారు. రాష్ట్రాలు కలసి పనిచేస్తే దేశం అభివృద్ధి బాటలో దూసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో తెలంగాణ ప్రగతిపై ఆదిత్య ఆసక్తి కనబరిచారు. తమ పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన హరితహారం, గ్రీన్ బడ్జెట్ వంటి అంశాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను పరిశీలించడానికి తాను హైదరాబాద్ వస్తానని ఆదిత్య చెప్పారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో చేపట్టిన పథకాలను ఆయన కేటీఆర్‌కు వివరించారు.