మొక్కజొన్న వేస్తే రైతుబంధు వర్తించదు.. కేసీఆర్  - Telugu News - Mic tv
mictv telugu

మొక్కజొన్న వేస్తే రైతుబంధు వర్తించదు.. కేసీఆర్ 

May 18, 2020

kcr

ప్రభుత్వం నిర్దేశించిన పంటలు వేస్తేనే రైతుబంధు పథకం వర్తిస్తుందని స్పష్టం చేసిన తెలెంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు మళ్లీ పంటల విధానంపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆయన రాష్ట్ర అవసరాలు, మార్కెట్ డిమాండును బట్టి పంట వేసుకోవాలని పునరుద్ఘాటించారు. భవిష్యత్తను దృష్టిలో ఉంచుకుని లాభసాటి వ్యవసాయం చేయాలని కోరారు. 

‘మన రాష్ట్రంలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పండిస్తున్నాం. గత ఏడాడి 53 లక్షల ఎకరాలలో పత్తి పంట, 79 లక్షల ఎకరాలలో వరి, 20 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పండించారు. ఏడు లక్షల ఎకరాలలో కందులు పండాయి. ఇకపై పంటలను ప్రణాళిక  ప్రకారం వేసుకుందాం. నియంత్రిత పంటల విధానం అర్థంకాని విషయమేమీ కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ పంటను, ఎంత విస్తీర్ణంలో వేస్తే లాభమో అది చెబుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు అందజేస్తారు…’ అని సీఎం చెప్పారు. 

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాల ఎకరాలకు సాగునీరు అంది, నాలుగున్నర కోట్ల వరి దిగుబడి వస్తుందని, అంత పంటను మిల్లింగ్ చేసే సదుపాయం మన రాష్ట్రంలో లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ఎకరా పత్తికి రూ. 50 వేలు, వరికి 25 వేల రూపాయల వస్తుంది కనుక పత్తి వేస్తే లాభమని అన్నారు. గత ఏడాది గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశారని, ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని కోరారు.  40 లక్షల ఎకరాలలో వరి,  12 లక్షల ఎకరాలలో కంది పంట వేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయొద్దని,  ఆ పంట వేస్తే రైతుబంధు పథకం వర్తించదని అన్నారు. అంతగా కావాలనుకంటే వచ్చే వేసవిలో వేయొచ్చున్నారు. ఇతర రాష్ట్రాల్లో క్వింటాలు మొక్కజొన్నకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారని, మనకు 1700 కావాలంటే ఎవరూ ఇవ్వరని అన్నారు.