లక్ష్యాలను 3 నెలల ముందే చెప్పాలి: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్యాలను 3 నెలల ముందే చెప్పాలి: కేటీఆర్

August 17, 2017

ప్రతి ప్రభుత్వ అధికారి తాను వచ్చే మూడు నెలల్లో సాధించాల్సిన లక్ష్యాలను ముందే చెప్పాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ప్రభుత్వ విధానాలు ఫలప్రదమయ్యేలా కృషి చేయాలని, నిర్ణీత గడువులో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. లేకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆయన గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో.. అయా శాఖల్లో నడుస్తున్న పలు కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో అనేక అద్భుత విధానాలను అమలులోకి తీసుకుని వచ్చింది. రాబోయే రెండు సంవత్సరాల పాటు పాలసీల్లో హమీ ఇచ్చిన అంశాల అమలును మరింత వేగంవంతం చేయాలి. ప్రభుత్వ పాలసీలకు దేశ వ్యాప్తంగా ప్రసంశలు అభించాయి. ఈ మేరకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులే ప్రాతిపాదికగా పనిచేయాలి’’ అని అధికారులను అదేశించారు. ఇకపైన వచ్చే ప్రతి మూడు నెలల్లో సాధించే శాఖపరమైన మైలురాళ్లను ముందే తెలియజేయాలన్నారు. ఈ మైళురాళ్లను అందుకోలేని అధికారులపైన కఠినంగా వ్యవహారించేందుకు వెనకడబోమని మంత్రి హెచ్చరించారు. గత ఎడాది ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ తో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచామని, ఈ సారి అదే స్థానాన్ని కొనసాగించేలా పనిచేయాలని అధికారులను కోరారు.

ఈ సమావేశంలో ఒక్కో కార్యక్రమం, ప్రాజెక్టులపైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డైవైజెస్ పార్కులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమల నుంచి వచ్చిన ఆసక్తి వ్యక్తికరణ మేరకు సూమారు 8500 వేల ఎకరాల ప్రాథమిక డిమాండ్ ఉన్నదని అధికారులు తెలిపారు. త్వరలోనే పర్యావరణ అనుమతుల మీద పబ్లిక్ హియరింగ్ ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఫార్మసిటీ ద్వారా కలిగే లాభాలు, ఉద్యోగాలు గురించి అవగాహన కల్పించారు. ఈ పార్కు లో జీరో లిక్విడ్ డిచార్జ్ ఉన్నందున ఏలాంటి కాలుష్యం ఉండదని వివరించాలన్నారు. ఏయిరో స్పేస్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకుని వచ్చేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక కంపెనీలు నగరంలో ఉన్నాయని, వీటికి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను నగరానికి తీసుకుని రావాలని అన్నారు.

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టుతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో పాటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కూడా పూర్తవుతుందన్నారు. టాస్క్ ద్వారా ఇప్పటిదాకా ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్దులకు శిక్షణ ఇస్తున్నామని, త్వరలో ఈ శిక్షణ కార్యక్రమాలను హెల్త్ సెక్టార్, ఫార్మా, అటోమోటివ్స్ రంగాలకు శిక్షణ కార్యక్రమాలను విస్తృతపరుస్తున్నట్లు తెలిపారు. టాస్క్ కేంద్రాలను జిల్లాలకు విస్తరించేందుకు దశల వారీగా ప్రయత్నాలు ప్రారంభించాలని మంత్రి కోరారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల కమిషనర్ నదీమ్ అహ్మద్, టియస్ ఐఐసి యండి వెంకటనర్సింహ రెడ్డి, పరిశ్రమలు, ఐటి శాఖల అధికారులు పాల్గొన్నారు.