తెలంగాణ జాగృతి  గిన్నిస్ రికార్డ్  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ జాగృతి  గిన్నిస్ రికార్డ్ 

September 11, 2017

కాళోజి 103వ  జయంతిని పురస్కరించుకొని రవీంద్రభారతి లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో  నిర్వహించిన కవితాంజలి కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ సాధించింది. 12 గంటలపాటు  నిర్విరామంగా కవితలు చదివి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు తెలంగాణ కవులు.

150 మందికి పైగా కవులు తమ కవితాగానంతో అలరించారు. గతంలో 111 మంది కవులతో నార్వే దేశంలో నిర్వహించిన కవి సమ్మేళనం  ప్రపంచ రికార్డును  మనోళ్లు బద్దలు కొట్టారు. ప్రజాకవి కాళోజి పుట్టినరోజు నాడు  ఈ రికార్డ్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని,ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందని పలువురు కవులు అన్నారు.