తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. రాష్ట్ర హోంశాఖలో 14,177 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. దీంతోపుట పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామానికి ఆర్థిక మంత్రిత్వ పచ్చజెండా ఊపింది. వివిధ విభాగాల్లో మొత్తం ఎస్ఐ పోస్టులు-1210 ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టులు 12,941, మొత్తం ఏఎస్ఐ పోస్టులు-26 గా ఉన్నాయి. వీటిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.ప్రభుత్వం ఏర్పాటై మూడున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విమర్శల నేపథ్యంలో సర్కారు పోలీసు, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల్లో వందలాది పోస్టుల భర్తీకి అనుమతిస్తోంది. అయితే సర్కారు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోందని, నోటిఫికేషన్, పరీక్షలు, నియామకాల్లో తీవ్ర జాప్యం చేస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
తాజాగా ప్రకటించిన 14 వేల పోలీసు కొలువుల వివరాలు.
సివిల్ కానిస్టేబుల్-5002
- స్పెషల్ కానిస్టేబుల్-3372
- ఏఆర్ కానిస్టేబుల్-2283
- ఎస్ఐ సివిల్-710
- ఎస్ఐ ఏఆర్-275
- ఎస్ఐ స్పెషల్ పోలీస్-191 పోస్టులు
- కమ్యూనికేషన్ ఎస్ఐ-29
- కమ్యూనికేషన్ కానిస్టేబుల్-142
- సీపీఎల్ కానిస్టేబుల్-53
- సీటీవో కానిస్టేబుల్-89
- ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ-26
- అన్ని విభాగాల్లో మొత్తం ఎస్ఐ పోస్టులు-1210
- అన్ని విభాగాల్లో మొత్తం కానిస్టేబుల్ పోస్టులు 12,941
- అన్ని విభాగాల్లో మొత్తం ఏఎస్ఐ పోస్టులు-26