తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Editor | 22 May 2020 4:02 AM GMT
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు పచ్చ జెండా ఊపింది ప్రభుత్వం. వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది విద్యాశాఖ. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షా తేదీలను ప్రకటించారు. జూన్ 8 నుంచి జూలై 5 వరకు వీటిని నిర్వహించనున్నట్టు చెప్పారు. మిగిలిన 8 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా షెడ్యూల్ తయారు చేశామన్నారు. ఇప్పటి వరకు ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. పరీక్షా హాల్‌లో శానిటైజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు విధిగా భౌతిక దూరం పాటించాలన్నారు.
పరీక్షా తేదీలు :
- జూన్ 8న ఇంగ్లీష్ పేపర్ 1
- జూన్ 11న ఇంగ్లీష్ పేపర్ 2
- జూన్ 14న గణితము పేపర్ 1
- జూన్ 17న గణితము పేపర్ 2
- జూన్ 20న సైన్స్(భౌతిక శాస్త్రం) పేపర్ 1
- జూన్ 23న సైన్స్(జీవశాస్త్రం) పేపర్ 2
- జూన్ 26న సోషల్ స్టడీస్ పేపర్ 1
- జూన్ 29న సోషల్ స్టడీస్ పేపర్ 2
- జులై 2న ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్(సంస్కృతం మరియు అరబిక్)
- జులై 5న ఒకేషనల్ కోర్సు(థియరీ)
Updated : 22 May 2020 4:04 AM GMT
Tags: 10th Exams exams lockdown SSC telangana
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire