తెలంగాణ: ఆగస్టు నుంచి ఒక్కొక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: ఆగస్టు నుంచి ఒక్కొక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం

July 7, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఓ శుభవార్తను చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెల నుంచి రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద కరోనా సంక్షోభం నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడానికి సిద్దమైందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను ఆయన బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకాన్ని పలుమార్లు పొడిగించిన కేంద్రం.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు ప్రజలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మే నెలలోనే ఈ ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేసిందని తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు నుంచి ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ వివరాలను వెల్లడించారు.