Telangana: 2,670 jobs sanctioned..these are the ones
mictv telugu

గుడ్‌న్యూస్: తెలంగాణలో మరో 2,670 సర్కార్ ఉద్యోగాలు

September 22, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అతి త్వరలోనే మరో గుడ్‌న్యూస్ చెప్పనుంది. మున్సిపాలిటీ శాఖలో ఖాళీగా ఉన్న 2,670 కొత్త ఉద్యోగాలను అధికారులు తాజాగా మంజూరు చేశారు. మంజూరైన ఈ కొత్త పోస్టులను గ్రూప్-4 కింద భర్తీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఏఏ విభాగాల్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి? జీతం ఎంత? పూర్తి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అనే తదితర విషయాలను అధికారులు వెల్లడించారు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు: 2,670
జూనియర్ అకౌంట్ ఆఫీసర్- 07
సీనియర్ అకౌంటెంట్- 37
సీనియర్ అసిస్టెంట్- 138
జూనియర్ అకౌంటెంట్- 94
జూనియర్ అసిస్టెంట్- 122
వార్డ్ ఆఫీసర్- 2242

ఇక, జీతాల విషయానికొస్తే..జూనియర్ అకౌంట్ ఆఫీసర్‌కు నెలకు రూ.42,300 నుంచి రూ. 1,15,270 వరకు, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్‌కు రూ.32,810 నుంచి రూ. 96,890 వరకు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్‌కు రూ.24280 నుంచి రూ.72.850 మధ్య చెల్లించనున్నారు. వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నెలకు రూ.22,240 నుంచి రూ.67,300 మధ్య చెల్లించనున్నారు. అయితే, పైన మంజూరు చేసిన ఉద్యోగాలకు సంబంధించి, కొన్ని పోస్టుల్లో ఆయా జిల్లాల వారీగా వీఆర్ఓలను సర్దుబాటు చేసినట్లు అధికారులు సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో ఎక్కువగా వార్డ్ ఉద్యోగాలే ఉన్నాయని, వీఆర్ఓలను కూడా ఈ పోస్టుల్లోనే ఎక్కువగా సర్దుబాటు చేసినట్లు తెలిపారు.

”33 జిల్లాల్లో మొత్తం 729 పోస్టుల్లో వీఆర్ఓలతో సర్దుబాటు చేశాం. మిగిలిన 1944 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తాం. ఈ ఉద్యోగాలకు సంబధించి, ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ వెలువరిస్తాం. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌లు కూడా అక్టోబర్‌ మొదటి వారంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నాం” అని అధికారులు తెలియజేశారు.