Telangana: 6 killed as container lorry, Auto collide head-on in Kamareddy district
mictv telugu

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఆటోలో ఉన్న ఆరుగురు మృతి

July 18, 2022

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మ‌‌ృతి చెందారు . మద్నూరు మండలం మెనూరు హైవే పై సోమవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటు చేసుకున్నది.

హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ వైపు కంటైనర్‌ లారీని.. మద్నూరు నుంచి బిచ్కుంద వైపు రాంగ్ రూట్ లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా ఉండడంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకువెళ్లింది. దీంతో ఆటోలో ఉన్నవారంతా దుర్మరణం చెందారు. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆటోను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఎక్కడి వారనే వివరాలు తెలియాల్సి ఉంది.