Telangana added some more posts in Group 2, 3 and 4
mictv telugu

గ్రూప్ 2, 3, 4 లలో మరికొన్ని పోస్టుల జోడింపు.. జీవో జారీ

November 24, 2022

తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్ 2, 3, 4 కేటగిరీలలో మరికొన్ని ఉద్యోగాలను చేరుస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్ 2లో ఆరు రకాల పోస్టులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్ఓ, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు జత చేశారు. గ్రూప్ 3 లో రెండు రకాలైన గిరిజన సంక్షేమ శాఖ అకౌంటెంట్, హెచ్వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చారు. గ్రూప్ 4 లో 4 రకాలైన పోస్టులు జిల్లా ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్, జువైనల్ సర్వీసెస్, సూపర్ వైజర్ మేల్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ మ్యాట్రన్ పోస్టులను చేర్చినట్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీనివల్ల రాబోవు ఉద్యోగ నోటిఫికేషన్లలో ఉద్యోగాల సంఖ్య పెరగనుంది.