తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. నేటీతో వేసవి సెలవులు ముగిశాయని, విద్యార్థులు రేపటి నుంచి కాలేజీలకు రావాలని కోరారు.
”తెలంగాణలో 2,962 జూనియర్ కాలేజీలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఇంటర్ సెకండియర్‌కు, జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏటా పరీక్షలు మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి పూర్తవుతుండటంతో జూన్‌లో ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించాం. ఫలితాల అనంతరం జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభిస్తాం” అని ఇంటర్‌బోర్డు తెలిపింది.
ఇక, ఇంటర్ కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే విషయాన్ని కూడా ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేశారు. మొత్తం 2,962 ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్‌లో 1,55,408 సీట్లు, సెకండియర్‌లో 1,55,408 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కావున విద్యార్థిని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, రేపటి నుంచి కాలేజీలకు రావాలని పిలుపునిచ్చారు. మరోపక్క సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపటి నుంచి ఇంటర్ తరగతులు కూడా ప్రారంభం అవుతాయని అధికారులు వివరాలను వెల్లడించారు.