అవి పాతవే, కాదు డిజైన్ మార్చారు..‘కృష్ణా’ ఏపీ, తెలంగాణ ఫైట్ - MicTv.in - Telugu News
mictv telugu

అవి పాతవే, కాదు డిజైన్ మార్చారు..‘కృష్ణా’ ఏపీ, తెలంగాణ ఫైట్

June 4, 2020

krishna

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వాడీవేడీ వాదనలు వినిపించాయి. ముందుగా తెలంగాణ తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ మాట్లాడుతూ… రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని తేల్చి చెప్పారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని తెలిపారు. వాటినే తాము కొనసాగిస్తున్నామని వివరించారు. అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన చేపడుతున్నారు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ తరపున ఆదిత్యనాథ్ దాస్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ వాదనను తప్పుబట్టారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్ మార్చిందన్నారు. అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా భావించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. ఏపీకి నీటి కేటాయింపుల ఆధారంగానే పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.