Telangana: Announcement released for degree courses in NIMS
mictv telugu

తెలంగాణ: నిమ్స్‌లో డిగ్రీ కోర్సులకు ప్రకటన విడుదల

July 15, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్) డిగ్రీ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఆగస్టు 4లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

అనంతరం నిమ్స్ డీన్ డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ..” నిమ్స్‌లో డిగ్రీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. న్యూరో టెక్నాలజీ, డయాలసిస్‌, కార్డియోవాస్కులర్‌, ఎమర్జెన్సీ అండ్‌ ట్రామాకేర్‌, రేడియో థెరఫీ, మెడికల్‌ ల్యాబరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా, పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ, రేడియేషన్‌ థెరఫీ, రెసిపిరేటరీ థెరఫి అండ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ వంటి కోర్సులు ఇందులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తాం. ఫిజియోథెరపీ(బీపీటీ)లో 50 సీట్లు, బీఎస్సీ (నర్సింగ్), పారామెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్లో బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో వంద సీట్లు ఉన్నాయి. విద్యార్థులు www.nims.edu.inను సంప్రదించండి. ఆన్లైన్‌లో దరఖాస్తులను వచ్చే నెల 1 లోగా సమర్పించాలి. నేరుగా వచ్చే అభ్యర్ణులు అసోసియేట్ డీన్, నిమ్స్, పంజగుట్టలో వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను అందజేయాలి” అని ఆయన అన్నారు.