తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలై, సప్లమెంటరీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు తెలంగాణ సర్కార్ మరో అవకాశాన్ని కల్పించింది. సప్లమెంటరీ పరీక్ష ఫీజులను చెల్లించడానికి గడువును పెంచుతూ, ప్రకటన విడుదల చేసింది.
” ఇంటర్ సప్లీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును ఈ నెల 18, 19 తేదీల వరకు పెంచాం. విద్యార్థులు రూ.200 ఆలస్య రుసుముతో ఫీజులను స్వీకరిస్తాం. నిజానికి ఫీజు చెల్లింపులకు తుది గడువు ఇదివరకే ముగిసింది. కానీ, వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నాం. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి” అని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అన్నారు.
మరోపక్క తెలంగాణలో ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలకు https://www.telangan aopenschool.orgను సంప్రదించాలని కోరింది.