Telangana: Applications for 181 jobs from today
mictv telugu

తెలంగాణ: 181 ఉద్యోగాలకు నేటి నుంచే దరఖాస్తులు

September 8, 2022

తెలంగాణ రాష్ట్రంలో గత నెల 27వ తేదీన మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో ఖాళీగా ఉన్న 181 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలు గ్రేడ్ -1 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ (సూప‌ర్ వైజ‌ర్) పోస్టుల కింద భ‌ర్తీ చేస్తున్నామని, ఈ ఉద్యోగాలకు కేవలం మ‌హిళలు మాత్రమే అర్హులని అధికారులు నోటిఫికేష‌న్‌లో తెలియజేశారు.

అయితే, టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన ఆ 181 ఉద్యోగాలకు నేటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ”ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి సూచిం చారు. నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచాం. మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి” అని ఆయన అన్నారు.

ఇక, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంజినీర్ల నియామకం, గురుకులాల నోటిఫికేషన్లకు సంబంధించి తాజాగా మంత్రి హరీష్ రావు ఆలస్య చేయకుండా త్వరలోనే నోటిఫికేషన్ల జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్వీసు నిబంధనలు సహా ఇతర అంశాలకు సంబంధించి ఏవైనా సవరణలు అవసరమైతే చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి జోన్లు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలు వీలైనంత త్వరగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంటే త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంజినీర్ల నియామకం, గురుకులాల నోటిఫికేషన్లు కూడా రానున్నాయని తెలుస్తోంది.