Home > Featured > ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly.

ఈనెల 9 ఉదయం 11 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు పది రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. సమావేశం మొదటి రోజే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయన వద్దే ఉండటంతో కేసీఆరే స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఓటాన్ అకౌంట్ కూడా కేసీఆరే ప్రవేశపెట్టారు.

ఇంకా ఏఏ అంశాలు చర్చించాలనే విషయంపై మాత్రం బీఏసీలో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ బడ్జెట్‌లో రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు అధిక మొత్తంలో కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Updated : 1 Sep 2019 7:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top