తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సభలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వాటిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంతిరెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.