తొలిరోజే రచ్చరచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

తొలిరోజే రచ్చరచ్చ

October 27, 2017

విపక్షాల ఆందోళనల నడుమ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభయ్యాయి. భేటీ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రైతు సమస్యలను ప్రస్తావిస్తూ పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చర్చ కోసం గట్టిగా పట్టుబట్టారు. అయితే ముందు ప్రశ్నోత్తరాలు జరగనివ్వాలని, తర్వాత చర్చిద్దామని డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి చెప్పినా ఫలితం లేకపోయింది. నిరసన మధ్యే ప్రశ్నోత్తరాలు సాగాయి. అర్చకుల ఎదుర్కొంటున్న సమస్యలను విపక్షాలు ప్రస్తావించాయి. ఈ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. సీదుల్లో ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు. అసెంబ్లీలో, శాసన మండలిలిలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత రెండు సభలూ సోమవారానికి వాయిదా పడ్డాయి.