యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం - MicTv.in - Telugu News
mictv telugu

యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం

September 16, 2019

telangana assembly.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ‘సేవ్ నల్లమల’ పేరుతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసారు. 

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే నల్లమల యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో కూడా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసారు. యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కేంద్రం మాట వినకపోతే కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోమవారం యురేనియం తవ్వకాల కోసం కేంద్రం పంపిన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభలోని సభ్యులు అందరూ మద్దతు తెలిపారు. దీంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.