తెలంగాణ భవన్‌ను పేల్చేస్తాం.. ఫోన్ కాల్.. అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ భవన్‌ను పేల్చేస్తాం.. ఫోన్ కాల్.. అరెస్ట్

March 2, 2018

హైదరాబాద్‌లోని అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌ను పేల్చేస్తామని బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో ఉన్న ఈ భవనానికి శుక్రవారం సాయంత్రం ఇలా కాల్ రావడంతో అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అణువణువూ తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందో గుర్తించిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని ఆదిలాబాద్ వాసిగా గుర్తించారు. అతడు ఎందుకిలా బెదిరించాడో తెలియాల్సి ఉంది.