Telangana Bars And Liquor Shops Open Till 1 Am For new year celebrations 2023
mictv telugu

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్..

December 29, 2022

Telangana bar and liquor shops timings extended on 31 December for new year celebrations

కొత్త సంవత్సరం వేడుకలకు జనం సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కుర్రకారు ఇప్పటినుంచే భారీగా స్కెచ్ వేస్తోంది. ధూంధాం ఎలా చెయ్యాల్లో పక్కాగా ఆలోచిస్తోంది. మందు చిందులతో ఊగిపోయేవాళ్లు మరింత ప్లాన్డ్‌గా ఉన్నారు. వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా గిఫ్ట్ లాంటి టైమింగ్ ప్రసాదించింది. ఈ నెల 31వ తేదీ రాత్రి జోష్ కోసం బార్ల సమయాన్ని, మద్యం దుకాణాల సమయాన్ని పొడిగించింది.

ఆ రోజు రాత్రి మద్యం షాపులు కిక్కిరిసి ఉంటాయి కనక ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న రాత్రి బార్లు, పబ్బులను ఒంటిగంటవరకు తెరిచి ఉంచుకోవచ్చని, మద్యం షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు జరుపుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. 2B లైసెన్సు కలిగిన బార్లలో 1 గంట వరకు మందు అమ్ముకోవచ్చు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తోపాటు మద్యం దుకాణాలకు ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల రెండేళ్లుగా మద్యం అమ్మకాలు ఆశించిన విధంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే మందు మందే, యాక్షన్ యాక్షనే అన్నట్లు పోలీసులు మాత్రం డ్రంకన్ డ్రైవింగ్ యథావిధిగానే నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో 31న అర్ధరాత్రి ఒంటి గంటకు అన్నీ బందైపోవాలని స్పస్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

న్యూ ఇయర్ వేడుకలకు కొత్త రూల్స్.. పాటించకపోతే కఠిన చర్యలే

న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల రూల్స్ ఇవే..

నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం