mictv telugu

రామాయణం స్టాంపులు.. తెలంగాణ వాసి ఘనత

March 14, 2019

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లుగా.. ప్రతి ఒక్కరికి ఎదో ఒక హాబీ ఉండడం సహజం. అలాగే కొందరికి పోస్టల్ స్టాంపులను సేకరించే హాబీ ఉంటుంది. తెలంగాణకు చెందిన ఓ ఉద్యోగి రామాయణం ఇతిహాసం ఆధారంగా వచ్చిన పోస్టల్ స్టాంపులను సేకరించి అరుదైన రికార్డు సృష్టించాడు.

వి.ఉపేందర్ పోస్టల్ శాఖలో పనిచేస్తున్నారు. స్టాంపుల కలక్షన్ ఆయన హాబీ. అయితే ఏ స్టాంపు పడితే ఆ స్టాంపు సేకరించకుండా తనదైన శైలిలో కేవలం రామాయణం ఇతిహాసానికి సంబంధించిన స్టాంపులను మాత్రమే సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 400 వరకు రామాయణ ఇతిహాస నేపథ్యంలో వచ్చిన స్టాంపులు సేకరించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం ఉపేందర్ తమిళనాడులోని మదురైలో పోస్ట్ మాస్టర్ జనరల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2019లో ఉపేందర్ సేకరించిన స్టాంపులను కూడా ప్రచురించనున్నారు. ఉపేందర్ సేకరించిన స్టాంపుల్లో రాముడు, సీత, హనుమంతుడు, రావణుడి చిత్రాలతో ఉన్న స్టాంపులు ఉన్నాయి. ఉపేందర్ తన స్టాంపుల కలెక్షన్‌ను అనేక కార్యక్రమాల్లో కూడా ప్రదర్శించారు.