బతుకమ్మ చీరలను ఇలా వాడేస్తున్నారయ్యా.. - MicTv.in - Telugu News
mictv telugu

బతుకమ్మ చీరలను ఇలా వాడేస్తున్నారయ్యా..

October 12, 2020

Telangana bathukamma sarees misuse

తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ముఖ్యమైనది. ఈ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతి ఏటా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు ఈ చీరలు ఇస్తున్నారు. కులమతాలకు అతీతంగా ముస్లిం, క్రైస్తవ మహిళలకు కూడా ఈ చీరలను అందిస్తున్నారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో స్వయంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న బతుకమ్మ చీరలు కొన్ని చోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. 

తాజాగా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి బతుకమ్మ చీరలను తోట చుట్టూ కంచెగా కట్టాడు. దీనిని గమనించిన ఆ గ్రామ మహిళలు ప్రభుత్వం కట్టుకోవడానికి ఇచ్చిన చీరలను ఇలా దుర్వినియోగం చేయడం ఏంటని నిలదీశారు. దీనిపై ఆ వ్యక్తి స్పందిస్తూ.. ఈ చీరలు ఈ ఏడాది ఇచ్చినవి కావని, గతేడాది ఇచ్చినవి అని చెప్పాడు. అతడి మాటలు నమ్మని ఆ మహిళలు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ చీరాల గురించి ఆరా తీయాలను విజ్ఞప్తి చేశారు.