5 కోట్ల వ్యూస్.. మైక్ టీవీ బతుకమ్మ పాటకు అపూర్వ ఆదరణ.. - MicTv.in - Telugu News
mictv telugu

5 కోట్ల వ్యూస్.. మైక్ టీవీ బతుకమ్మ పాటకు అపూర్వ ఆదరణ..

July 18, 2019

మైక్ టీవీ బతుకమ్మ పాటకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. కనువిందైన ఈ వీడియో సాంగ్ రెండేళ్లుగా వీక్షకులను అలరిస్తూనే ఉంది. 2017లో ఈ పాట విడుదలైనప్పుడు కేవలం ఒక్క నెలలోనే కోటీ వ్యూస్‌ను అందించిన మీకు శతకోటి వందనాలు. మంగ్లీ ఆలాపననలో, దాము కొసనం దర్శకత్వంలో, అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ పాటతో పాటు మరెన్నో మైక్ టీవీ పాటలు అందరి మనసులు గెలుచుకున్నాయి. మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇకముందూ ఇలాగే  మీ కనులకు ఇంపుగా, మీ చెవులకు విన సొంపుగా మంచి, మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తాం. మైక్ టీవీని ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.