Telangana: Bealert..Heavy rains till 10th of this month
mictv telugu

బీఅలర్ట్: ఈ నెల 10 వరకు భారీ వర్షాలు..ఈ జిల్లాలోనే

September 7, 2022

Telangana: Bealert..Heavy rains till 10th of this month

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, గతరాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

”గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి ఛత్తీస్ గఢ్ నుంచి ఏపీ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతుంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాబోయే 48 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి, బుధ, గురు, శుక్రవా రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి” అని అధికారులు పేర్కొన్నారు.

ఇక, జిల్లాల వారిగా చూస్తే..ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. కనుక హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో కోరింది.

ఇక, సోమ, మంగళవారాల్లో అత్యధికంగా..

Telangana: Bealert..Heavy rains till 10th of this month