Telangana: Bikarpul..Heaviest rains today
mictv telugu

తెలంగాణ: బీకేర్‌పుల్..నేడు అత్యంత భారీ వర్షాలు

July 12, 2022

 

 

తెలంగాణ రాష్ట్రంలో నేడు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేసింది. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెడ్ అలర్ట్‌ను జారీచేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, యువకులు బీకేర్‌పుల్‌గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

”ఒడిశా తీరంలోని వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. రాగల 48 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 15 వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటికి సాధారణం కన్నా 19.18 సెంటీమీటర్ల అధిక వర్షపాతం కురిసింది. జూన్‌ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాధారణంగా సగటు వర్షం 20.39 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా, అధికంగా 39.57 సెంటీమీటర్ల వర్షం కురిసింది.” అని అధికారులు పేర్కొన్నారు.

మరోపక్క 10వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో సాధారణంగా 6 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉండగా అధికంగా 2.98 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, రాష్ట్రంలో 29 జిల్లాల్లో అత్యధిక వర్షం కురువగా, వికారాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురిసినట్టు టీఎడీపీఎస్  తెలిపింది.