తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్ ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. దీంతో జేబీఎస్ వద్ద నిరసన తెలపడానికి బీజేపీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. ఆందోళన చేపట్టడం కోసం బండి సంజయ్ అక్కడకు వెళ్లకుండా పోలీసులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని.. జేబీఎస్‌లో నిరసన చేసి తీరుతామని చెబుతున్నారు.