Telangana Bjp chief Bandi sanjay kumar sworn at Yadadri temple denied mlas farm house deal
mictv telugu

యాదాద్రిలో ‘డీల్’పై ప్రమాణం చేసిన బండి సంజయ్

October 28, 2022

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవవహారంతో తమకెలాంటి సంబంధమూ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేశారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పురోహితుల చెంత ఆయన ఈ కార్యక్రమం పూర్తి చేశారు. ఫామ్ హౌజ్ జరిగిన దానితో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని ఆయన పేర్కొన్నారు.

తమకు సంబంధముందని నిరూపించాలని, యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయాలని ఆయన టీఆర్ఎస్‌కు గురువారం సవాల్ విసరడం తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడంతో ఆయనే గుడికి వెళ్లి తడిబట్టలతో ప్రమాణం చేశారు. ‘‘బీజేపీ నాయకులకు గాని, శ్రేణులకు గాని ఆ బేరసారాలతో సంబంధం లేదు. ఈ పవిత్రమైన ప్రాంతంలో అది వాస్తవం కాదని ప్రమాణం చేస్తున్నాను. సీఎం వస్తారనుకుంటే రాలేదు. మాకెలాంటి సంబంధం లేదని స్వామివారిపాదాల చెంత ప్రమాణం చేస్తున్నాను ’ అని చెప్పారు. కాగా అంతకు ముందు యాదాద్రిలో బండి సంజయ్‌కి నిరసనలు ఎదురయ్యాయి. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రమాణం చేయాడానికి వస్తాడేమోనని తాను గంటపాటు ఎదురుచూస్తానని బండి చెప్పారు.