Telangana bjp chief bandi sanjay tears on notice to bl Santosh
mictv telugu

భోరుమని ఏడ్చేసిన బండి సంజయ్..

November 22, 2022

Telangana bjp chief bandi sanjay tears on notice to bl Santosh

బీజేపీ నాయకులు ఎంతో నిజాయతీపరులని, వారిపై నిందలు వేయడం చాలా బాధ కలిగిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపైనే గుడ్ల నీళ్లు కక్కకుంటూ వలవలా ఏడ్చేశారు. మంగళవారం హైదరాబాద్ శివారులో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుని విలపించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసు ఇవ్వడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘ఆయన ఏ తప్పు చేశారని నోటీసు ఇచ్చారు? బీఎల్ సంతోష్‌ ఎంపీ కావాలని, ఎమ్మెల్యే కావాలని కోరుకోలేదు. ఆస్తులు సంపాదించలేదు. ఆయనకు ఫామ్ హౌసులు లేవు. విదేశాల్లో వ్యాపారం చేయలేదు. ఆయన దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణు అప్పుల కుప్పగా మార్చారని, ఏటా 30 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక ప్రజా సంగ్రామ యాత్రను అడ్డకుంటున్నారన్నారు.