Telangana bjp leader dasoju shravan demads prompt salary payment on Dussehra festival
mictv telugu

పండగపూటైనా 1న జీతాలు ఇవ్వండి.. దాసోజు శ్రవణ్

September 28, 2022

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకల్లా ఎందుకు జీతాలివ్వడం లేదని తెలంగాణ బీజేపీ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఉద్యోగులకు ఒకటో తేదీన ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘దసరా పండగ సమయానికైనా వేతనాలు వస్తాయా, లేదా? అనే ఆందోళనలో ఉద్యోగులు, పెన్సనర్లలో ఉంది. గత ఏడాది కూడా దసరా పండక్కి జీతాలు ఇవ్వలేదు. సమయానికి జీతం రాక అప్పులు చేస్తున్న ఉద్యోగులు వచ్చిన జీతాన్ని వడ్డీలకి ఇచ్చి ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. కనీసం ఈ ఏడాదైన కుటుంబ అవసరాల నిమిత్తం దసరా పండక్కి జీతాలు, పెన్షన్లు ఇవ్వండి’’ ఓ ప్రకటనలో కోరారు. అక్టోబర్ 5 లోగా సద్దుల బతుకమ్మ, దసరా పండుగలున్నందున, కుటుంబ అవసరాల నిమిత్తం సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్ అక్టోబర్ 1 న చెల్లించాలని డిమాండ్ చేశారు.