కోదండరామ్ బీజేపీతో టచ్‌లో ఉన్నారు.. కిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

కోదండరామ్ బీజేపీతో టచ్‌లో ఉన్నారు.. కిషన్

September 27, 2018

తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా విపక్షాల మధ్య సీట్ల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఎక్కడ పెద్ద పీట వేస్తే అక్కడికే వెళ్దామనుకుంటున్నారు. మహాకూటమిలో టీడీపీ చేరిక ఖరారైంది. సీపీఐ కూడా చేరువైంది. తెలంగాణ జనసమితి(టీజేఎస్) మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ బీజేపీతో మంతనాలు సాగిస్తోందని వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది.

trtt

టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత కిషన్ రెడ్డి ఈ రోజు వెల్లడించారు. మహాకూటమిలో టీజేఎస్ 25 సీట్లు ఆశించగా, కాంగ్రెస్ అది సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సీపీఐ, టీడీపీలకు కూడా సీట్లు కేటాయించాల్సి ఉందిక కనుక టీజేఎస్‌కు 10కి మించి ఇచ్చే అవకాశంలేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కోదండరామ్ బీజేజీవైపు చూస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అబద్ధాలని మహాకూటమితో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని టీజేఎస్ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ బీజేపీతో అనధికారిక దోస్తీ చేస్తోందని, అలాంటప్పుడు బీజేపీ వెంట ఎందుకు వెళ్తామని ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో కోదండరామ్ తమతో మంతనాలు జరుపుతున్న మాట నిజమేనని కిషన్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది.