Telangana bjp leader swami Goud left bjp to join Trs
mictv telugu

బీజేపీకి స్వామిగౌడ్ గుడ్‌బై.. తిరిగి టీఆర్ఎస్ గూటికి..

October 21, 2022

మునుగోడు ఉప ఎన్నికల పుణ్యమా అని రాజకీయ తక్కెడ బేరాలు జోరుగా సాగుతున్నాయి. అసంతృప్తులు, ఆహావహులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో జనం సీట్ల కోసం కర్ఛీఫ్ వేసిన్నట్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీలూ దీనికి అతీతం కాదు. శుక్రవారం ఉదయం తాజా బీజేపీ నేత దాసోస్ శ్రవణ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్న వార్త హల్ చల్ చేస్తుండగానే మరో బీజేపీ నేత, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆ పార్టీకి చివరి నమస్కారం పుట్టేశారు. ఆయన కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం.

బీజేపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో స్వామిగౌడ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి లేఖ రాశారు. ‘‘పార్టీలో ధనికులకు, బడా కాంట్రాక్టర్లకు ప్రాధ్యమిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న బలహీన వర్గాల కార్యకర్తలను, నాయకులను విస్మరిస్తున్నారు. బలహీన వర్గాల నాయకులు అనేక అవమానాలకు గురవుతున్నారు’ అని ఆక్షేపించారు. ఈ పరిస్థితులతో కలత చెంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. స్వామిగౌడ్ రెండేళ్ల కిందట టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.

 

swamy goud