గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు రన్నింగ్ లోనే ఊడిపోయింది. కారు నెమ్మదిగా వెళ్లడంతో పాటు..డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. గురువారం అసెంబ్లీ సమావేశాలను ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.రాజాసింగ్ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇప్పటికే పలు మార్లు మధ్యలోనే ఆగిపోయింది. ఐదారు సార్లు నడిరోడ్డుపై నిలిచిపోయింది. తరచుగా తన వాహనం నిలిచిపోవడంపై కొద్దిరోజుల నుంచి రాజాసింగ్ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని ఇంటెలిజెన్స్ ఐజీకి కూడా లేఖ రాశారు.దీనిపై సరైన స్పందన రాని సమయంలో మరోసారి రాజాసింగ్ కారు ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశమైంది.